Monday, August 9, 2010

Names with letter M

ManDodari : మండోదరి - పలుచని ఉదరము కలది (మండ-పలుచని). మండోదరి' రామాయణంలో రావణాసురుని భార్య. ఈమె మహా పతివ్రత. మండోదరి మాయాసురుడి కుమార్తె. రావణాసురుడు ఈమెను మోహించి అపహరించి పెళ్ళాడాడు. ఇంద్రజిత్తు ఈమెకు పుట్టిన కుమారుడు.

ManmadhuDu : మన్మధుడు - మన్మధుడు అంటే మనస్సు కలత పెట్టువాడు , మనసుని మధించేవాడని పురాణాలు వర్ణించాయి.మన్మధుడు పూవిలుకాడు. పూల బాణాలు వేసి గుండెలలో ప్రేమను పెంచును. ఈయనకు మనసిజుడు అని , అనంగుడని ,
పుష్పధన్యుడు అని పేర్లు ఉన్నాయి . మంచి రూపం కలిగిన వాడు. విష్ణువు కు మానస పుత్రుడు. రతీదేవి ఈయన భార్య. .

Mahishasura : మహిషాసురుడు -- హిందూ పురాణాలలో రాక్షసుడు
1. మహిషుని తండ్రి అసురుల రాజైన రంభుడు ఒకనాడు 'మహిషం' (గేదె) తో కలిసి రతిలో పాల్గొన్న మూలంగా జన్మించాడు. అందువలన మహిషాసురుడు మనిషి లాగా దున్నపోతులాగా రూపాంతరం చెందగల శక్తి కలవాడు.
2. 'మహిష్మతి' అనే ఆమె శాపం వలన మహిషమై(గేదె) ఉండి సింధు ధ్వీపుడనే రాజు రేతస్సును మింగి గర్భాన్నిధరించి మహిషాసురుడు కి జన్మనిస్తుంది. దుర్గాదేవి మహిషున్ని ఎదిరించి తొమ్మిది రోజులు తీవ్రంగా పోరాడుతుంది. పదవ రోజున ఇంతటి బలమైన రాక్షసున్ని వధిస్తుంది.

Mahishaasura mardhini : మహిషాసుర మర్ధిని -- మహిషాసురుడనే రాక్షసుడిని చంపడం వల్ల పార్వతికి ఈ పేరు వచ్చినది .

MaareechuDu : మారీచుడు : రాక్షసి తాటక కి కుమారుడు . సీతాపహరణ సమయం లో రావణుడు ఇతన్ని బంగారు జింక గా మారమని అదేశిస్తాడు ... తరువాత రాముని చే హతమార్చబడినాడు . ఇతని సోదరి కైకసి , సోదరుడు సుబాహుడు .

Menaka : మేనక -- మేనక ఇంద్రుని సభలోని అప్సరసలలో ఒకరు. విశ్వామితుడి తపోభంగానికి ఇంద్రుడు నియమించిన అప్సరస . వీరిరువురి కలయిక వలన శకుంతల జన్మించింది .

Mohini : మోహిని -- మోహిని అంటే సాధారణంగా నారాయణుని మోహినీ అవతారము . దేవదానవులు అమృతాన్ని సాధించినతరువాత నాకంటే, నాకు అని పోరాటంచేస్తుంటే విష్ణుమూర్తి మోహినీ రూపంలో వచ్చి అందరినీ మోహించి, అమృతాన్ని పంచుతాను అని చెప్పి దేవతలకు మాత్రం ఇచ్చి రాక్షసులను మోసం చేస్తాడు. రాహుకేతువులు దేవతల వరుసలో కూర్చుంటే, వారిని తన చక్రాయుధంతో వధిస్తాడు.

ఇదే మోహినీ అవతారంలో విష్ణుమూర్తి శివుడిని కూడా మోహింపచేస్తాడు.



  • =====================================
Visit my Website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog material