Monday, August 9, 2010

Names with letter R

Raama : రాముడు -- హిందూ దేవతలలో ప్రముఖుడు. ఆయోధ్యా నగరం రాజధానిగా, కోసలదేశాన్ని ఇక్ష్వాకువంశపు రాజై పరిపాలించాడు . అతను పురాతన భారత దేశమును వాస్తవముగ పరిపాలించిన రాజుగా నేటి చరిత్రకారులు భావించుచున్నారు. రాముడు తన జీవితమునందు ఎన్ని కష్ఠములు ఎదురెనను ధర్మమును తప్పకుండెను. ఆ కారణము చేత రాముడిని ఆదర్శ పురుషునిగా వ్యవహరించెదరు. రాముడి తండ్రి -ధశరధుడు ,తల్లి -కౌసల్య , పినతల్లులు- సుమిత్ర ,కైకేయి , సోదరులు - భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు , భార్య -సీతాదేవి .పిల్లలు -లవ కుశలు .


Raavana : రావణాసురుడు -- కైలాసమును రావణుడు ఎత్తగా దానిని శివుడు బొటనవేలితో నొక్కినప్పుడు గొప్ప రవము (ధ్వని) చేసినవాడు అని అర్ధము . రావణుడు (Ravana) రామాయణములో ప్రధాన ప్రతినాయకుడు. రామాయణం ప్రకారం రావణుడు లంక కు అధిపతి. పది రకాలుగా ఆలోచించేవాడనే దానికి, పది విద్యలలో ప్రవీణుడు అన్నదానికి ప్రతీకగా, కళారూపాలలో రావణుని పదితలలతో చిత్రిస్తారు. పదితలలు ఉండటం చేత ఈయనకు దశముఖుడు (పది ముఖములు కలవాడు), దశగ్రీవుడు (పది శీర్షములు కలవాడు), దశ కంథరుడు, దశకంఠుడు (పది గొంతులు కలవాడు) అన్న పేర్లు వచ్చాయి. బ్రహ్మ మానస పుత్రుడైన పులస్త్యుని కుమారుడు విశ్రవసునికి, దైత్య రాకుమారియైన కైకసికి రావణాసురుడు జన్మిస్తాడు. కైకసికి తండ్రి సుమాలి. రావణుని భార్య ' మండోదరి ' .
రావణాసురుడి కి ఆరుగురు సోదరులు ,ఇద్దరు సోదరీమణులు, ఏడుగురు కొడుకులు .
సోదరులు = 1. కుబేరుడు 2. కుంభకర్ణుడు 3. విభీషణుడు 4. ఖరుడు 5. దూషణుడు 6. అహిరావణుడు , సోదరీమణులు = 1. శూర్పణఖ(చంద్రనఖు)2.కుంభిని . కుమారులు = 1. ఇంద్రజిత్తు , 2. ప్రహస్థుడు,3. అతికాయుడు,4. అక్షయకుమారుడు,5. దేవాంతకుడు,6. నరాంతకుడు, 7. త్రిశిరుడు.

Rambha : రంభ -- ఇంద్రుని సభలోని అప్సరసలలో ఒకరు. రూప రేఖాలావణ్యాలు గల నర్తకి . దేవలోకానికి అధిపతియైన ఇంద్రుడు భూలోకములో ఋఉషుల తపస్సు లను భగ్ననము చేయుటకు పంపే అప్సరసలలో రంభ ఒకతె . రంభ , కుబేరుని కొడుకు అయిన 'నలకుబేరుని' భార్య ..

Radha : రాధ లేదా రాధిక -- శ్రీకృష్ణుని ప్రియురాలు , నందుని చెల్లెలు . కొందరు వైష్ణవులు రాధను శక్తి అవతారంగా భావిస్తారు. భారతదేశంలో రాధాకృష్ణులకు చాలా దేవాలయాలు ఉన్నాయి. రాధాకృష్ణులను ప్రేమకు చిహ్నాలుగా ఎంతోమంది కవులు, చిత్రకారులు కొన్నిశతాబ్ధాలుగా వర్ణిస్తూ, చిత్రీకరిస్తూనే వున్నారు..

Rathidevi : రతీదేవి --దక్ష ప్రజాపతి కూతురు . మన్మధుని భార్య , మన్మథుడు లోకాలన్నిటినీ మోహింప చేయగల శక్తి ఉన్నవాడు. అలాంటి మన్మథుడినే మోహింప చేయగల శక్తి ఉన్న అతిలోక సర్వావయవ సౌందర్యవతి రతీదేవి. ఈ ఇద్దరికీ వివాహం ఎప్పుడు ఎలా అయింది? అనే విషయాన్ని కామ వివాహం అనే పేరున శివపురాణం రుద్ర సంహితలోని మూడు, నాలుగు అధ్యాయాలు వివరిస్తున్నాయి. మన్మథుడు బ్రహ్మ మనస్సు నుంచి జన్మించిన తర్వాత ఆ బ్రహ్మ దేవుడు తనతో సహా అందరినీ మోహింప చేయగల శక్తిని మన్మథుడికి అనుగ్రహించాడు.

Renuks : రేణుక --రేణుక భృగు వంశానికి చెందిన మహర్షి జమదగ్ని భార్య,. జమదగ్ని, రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు.. భృగు మహర్షి వీరి వంశానికి మూల పురుషుడు.

Revathi : రేవతి -- ఒక నక్షత్రము . దక్షప్రజాపతి కూతురు . చంద్రుని భార్య , భార్యలందరిలో రేవతి అంటే చంద్రునికి మిక్కిలి ప్రేమ .


Rukmini : రుక్మిణి - రుక్మము(బంగారము) కలది. రుక్మిణీ దేవి శ్రీ కృష్ణుడి ఎనమండుగురి భార్యల లొ పెద్ద భార్య. ఈమెను లక్ష్మీ దేవి అంశగా హిందువులు నమ్ముతారు. రుక్మిణీ దేవికి సంబంధించిన కథలు మహా భాగవతము దశమ స్కందము లొ వస్తుంది. విదర్భ దేశాన్ని భీష్మకుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు, ఆ రాజు కి రుక్మి, రుక్మరత, రుక్మకేతు, రుక్మబాహు, రుక్మనేత్ర అనే ఐదుగురు కుమారులు. వీరికి రుక్మిణీ అనే సోదరి ఉన్నది. రుక్మిణి కొడుకు ప్రద్యుమ్నుడు .


RushyamUkamu : ఋష్యమూకము -- అన్న వాలి చే తరుమబడి సుగ్రీవుడు తలదాచుకున్న కొండ . తన తల వేయి ముక్కలవును అనే ముని శాపము తో వాలి ఈ కొండ దరిదాపులకు రాడు .


  • ======================================
Visit my Website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog material