Monday, August 9, 2010

Names with letter D

Daakini : డాకిని -- మంత్రాలను వల్లించడం ద్వారా అద్భుతాలు చేసే స్త్రీ . హిందూ పురాణాలలో చెప్పబడిన స్త్రీ .

Damayanthi : దమయంతి - 'దమనుడు' అను ముని వరము వలన జన్మించినది. 2. తన అందముచే ఇతరులను దమించునది.(అణచునది).భీమమహారాజు కుమార్తె ,నిషధ రాజా నలునితో వైభవోపేతంగా వివాహం జరిగింది. కుమార్తె ఇంద్రసేన, కుమారుడు ఇంద్రసేనుడు .

Damodarudu : దామోదరుడు -- క్రిష్ణుడు చిన్నతనం లో తల్లి యశోద అతని నడుముకు పొట్టకు కట్టువేసి బండరాయికి కట్టివేసినది . బంధితమైన పొట్టగల వాడు కనుకనే ఆ నాటి నుంచి ఆయనకు దామోదరుడు అనే పేరొచ్చింది.

Dasarathudu : దశరధుడు - దశ (పది) దిశలలో రధ గమనము కలవాడు. అయోధ్య రాజ్యానికి రఘు వంశపు రాజు . ముగ్గురు -(కౌషల్య , సుమిత్ర , కైకేయి ) భార్యలకు ... రాముడు , లక్ష్మణుడు , భరత ,శత్రుఘ్నులు (నలుగురు) కుమారులు .

Dattatreyudu : దత్తాత్రేయుడు -- శ్రీ దత్తాత్రేయ స్వామి త్రిమూర్తుల (బ్రహ్మ, విష్ణు మూర్తి, మహేశ్వరుడు) స్వరూపం. గురుతత్వానికి మొదటివాడు అవడంవల్ల ఈయనకు ఆదిగురువనే పేరు ఉన్నది. సప్తర్షులలో ఒకడైన అత్రి మహర్షి, అనసూయల కొడుకే దత్తుడు. ఆయన ఎందరో మహా పురాణపురుషులకు, దేవతలకు జ్ఞానబోధ, సహాయము చేసిన ఉదాహరణలు వివిధ పురాణాలలో ప్రస్తావించబడ్డాయి.

Draupadi : ద్రౌపది
-- పాంచాల రాజైన ద్రుపద మహారాజు కుమార్తె . మహాభారరము లో ప్రముఖ పాత్ర . అర్జునుడు మత్స్యయంత్రము కొట్టగా ఆమె పాండవులకు భార్య అయినది .


DrupaduDu : దృపదుడు -- పాంచాల రాజు . ద్రౌపది తండ్రి . ఈయన కుమారులు ... ద్రుష్టద్యుమ్నుడు , శిఖండి .

Dhanvantari : ధర్వంతరి
-- క్షీరసాగర మధన సమయము లో జర్మించినది . ఆయుర్వేదానికి అధిష్టాన దేవత .


DharmarAju : ధర్మరాజు
-- మహాభారతము లో పంచపాండవులలో మొదటివాడు . యుధిష్టిరుడని మరొక పేరు . సత్యము, అహింస మొదలగు ధర్మములను పాటించే రాజు. కుంతి భర్త అనుమతి పొంది ధర్ముని వలన(యమధర్మరాజు) కన్న సంతానము కనుక ధర్మజుడని, యుద్ధమునందు స్థిరమైన పరాక్రమమును ప్రదర్శించువాడు కనుక యుధిష్టిరుడని పేర్లు కలిగాయి. జూదము లో ఓడిపోయి విరాట కొలువులో కంకుభట్టు గా ఉంటాడు .


DharmavyAdhudu : ధర్మవ్యాధుడు
--మిధిలా నగరము లో ఉండేవాడు . సమస్త ధర్మాలూ చక్కగా తెలిసినవాడు .


Dhrutaraastrudu :ధృతరాష్ట్రుడు
-- కురువంశరాజు అయిన విచిత్రవీర్యుని కుమారుడు . అంధుడు . గాంధారి ఈయం భార్య . దుర్యోధనుడు .. .తదితర నూరు మంది కుమారులు , వీరినే కౌరవులు అంటారు .


Duryodhanudu : దుర్యోధనుడు - (దుర్+యోధుడు) ఇతరులు సుఖముగా యుద్ధము చేయుటకు వీలుపడనివాడు. మహాభారతంలో ధృతరాష్ట్రుని నూర్గురు పుత్రులలో ధుర్యోధనుడు ప్రధముడు, కౌరవాగ్రజుడు. గాంధారీ దృతరాష్ట్రుల పుత్రుడు. గాంధారీ గర్భవతిగా ఉన్న సమయంలో కుంతీదేవి ధర్మరాజుని ప్రసవించిన విషయం వినిన తరవాత 12 మాసముల తన గర్భాన్ని ఆతురతవలన తన చేతులతో గుద్దుకొని బలవంతంగా మృత శిశువుని ప్రసవించినది. ఈ విషయంవిన్న వ్యాసుడు హస్తినకు వచ్చి కోడలిని మందలించి ఆ పిండం వృధా కాకుండా నూటొక్క ముక్కలుగాచేసి నేతి కుండలలో భద్రపరచాడు. వ్యాసుడు వాటిని చల్లని నీటితో తడుపుతూ ఉండమని వాటిలో పిండము వృద్ధిచెందిన తరవాతనూరుగురు పుత్రులు ఒక పుత్రిక జన్మిస్తారని చెప్పి వెళ్ళాడు. గాంధారి వ్యాసుని ఆదేశానుసారం చేయగా ముందుగా వాటిలో పెద్ద పిండం పరిపక్వమై అందునుండి దుర్యోధనడు జన్మించాడు. తరవాత క్రమంగా తొంభై తొమ్మిదిమంది పుత్రులు ఒక పుత్రిక పేరు దుస్సల జన్మించారు. ఈ విధంగా గాంధారీ దృతరాష్ట్రులు దుర్యోధనాదులను సంతానంగా పొందారు.

Dussala : దుస్సల --ధృతరాష్ట్రుడు , గాంధారి ల ఏకైక కుమార్తె . ధుర్యోధనాదుల సోదరి . ఈమె సింధు దేశ రాజు జయద్రదుని వివాహము చేసుకొన్నది. కురుక్షేత్ర సంగ్రామంలో జయద్రదుని అర్జునుడు సంహరించాడు. ఈమెకు సురధుడు అను కుమారుడు ఉన్నాడు

Dusshaasanudu : దుశ్శాసనుడు - సుఖముగా శాసింప (అదుపు చేయ) సాధ్యము కానివాడు. దుశ్శాసనుడు గాంధారీ ధృతరాష్ట్రుల పుత్రుడు. దుర్యోధనుని నూరుగురు కౌరవ సోదరులలో ఒకరు. దుశ్శాసనుడు ద్రౌపతిని సభలోనికి జుట్టు పట్టుకొని లాగుకొని వచ్చి, నిండు సభ లో ద్రౌపతి వస్త్రాపహరణం నకు పూనుకున్నాడు. కానీ శ్రీ క్రిష్ణుడి అభయ హస్తం తో ద్రౌపతి గౌరవం కాపాడబడింది.

Dushyanthudu : దుష్యంతుడు-- హస్తినాపురానికి రాజైన దుష్యంతుడు మహారాజు . శకుంతల భర్త . భరతుని తండ్రి .


Daaxaayani
: దాక్షాయణి --హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, బద్రకాళి , శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.



Durvaasudu : దుర్వాసుడు - దుష్టమైన వస్త్రము కలవాడు. (వాసమనగా వస్త్రము), దుర్వాసుడు, హిందూ పురాణాలలో అత్రి మహర్షి , అనసూయ ల పుత్రుడు. ఇతడు చాలా ముక్కోపి. అలా కోపం తెప్పించినవారిని శపిస్తాడు. ఇలా శపించడం వలన ఎంతో మంది జీవితాలు నాశనమయ్యాయి. అందువల్లనే ఆయన ఎక్కడికి వెళ్ళినా అందరూ ఆయన్ను విపరీతమైన భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆయన కోపానికి గురైన వారిలో అభిజ్ఞాన శాకుంతలంలో వచ్చే శకుంతల ఒకరు.

Dronudu : ద్రోణుడు - ద్రోణము(కుండ)నుండి పుట్టినవాడు. భరద్వాజ మహాముని పుత్రుడు ద్రోణుడు. వేదవేదాంగాలన్నీ అభ్యసించాడు. ద్రోణుడితో పాంచాల దేశపు రాజకుమారుడు ద్రుపదుడు అస్త్రవిద్య నేర్చుకున్నాడు. కృపాచార్యుడి చెల్లెలు కృపిని వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుని పేరు అశ్వత్థామ. పరశురాముడు వద్ద అస్త్రవిద్య నేర్చుకున్నాడు. అది తరవాతి కాలంలో హస్థినాపురంలో కౌరవులకు పాండవులకు అస్త్రవిద్య నేర్పటానికి దారితీసింది. . అర్జునుడు అతనికి ప్రియ విద్యార్థి.

DakshinAyanamu : దక్షినాయనము : సూర్య్భగవానుడు కర్కాటక రాశిలో ప్రవేశించిన సమయం నుండి మకరరాశిని చేరే వరకు మధ్యనున్న సమయమే దక్షిణాయనము . ఆ సమ్యములో సూర్యుడు భూమధ్యరే్ఖకు దక్షిణము గా సంచరిస్తాడు .

Dhvajastambham : ధ్వజస్తంభము -- సూర్యుని కాంతి కిరణములు నలభై ఐదు డిగ్రీల కోణము లో పరవర్తనము చెందుతాయి . ఆ దిశగా ధ్వజస్తంభాన్ని ప్రతిస్ఠారు . దక్షిణ వైపు నుంచి వచ్చే కుజగ్రహ కిరణాలు గోపుర కలశము మీదుగా ధ్వజస్తంభము పైనుంచి స్వామి భూమధ్యకి చేరుతాయి అందుకే ధ్వజస్తంభమునకు , స్వామికి మధ్యన నిల్చుని నమస్కరించాలి . అప్పుడే గ్రహశక్తితో పాటు స్వామి శక్తీ మనల్ని చేరుతుంది .



  • ======================================
Visit my Website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog material