Monday, August 9, 2010

Names with letter P

Parvati : పార్వతి -- హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

Prahlaadudu : ప్రహ్లాదుడు - భగవంతుని దర్శనముచే అధికమైన ఆహ్లాదము పొందువాడు . ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడు. ఈతడు అసుర రాక్షసుడు అయిన హిరణ్యకశిపుని కుమారుడు. ప్రహ్లాదునకు దమని అనే కన్యతో వివాహము జరిగినది. వీరికి వాతాపి, ఇల్వలుడు అనే కుమారులు కలరు.


Parasuraamudu : పరశురాముడు-- శ్రీమహావిష్ణువు దశావతారములలో పరశురామావతారము (Parasurama Incarnation) ఆరవది. త్రేతాయుగము ఆరంభములో జరిగినది. అధికార బల మదాంధులైన క్షత్రియులను శిక్షించిన అవతారమిది. పరశురాముని భార్గవరాముడు, జామదగ్ని అని కూడా అంటారు. జమదగ్ని, రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు. పరశురాముడు శివుని వద్ద అస్త్రవిద్యలను అభ్యసించి, అజేయ పరాక్రమవంతుడై, ఆయన నుండి అఖండ పరశువు (గండ్ర గొడ్డలి) పొంది, పరశురాముడైనాడు.

Paraasharudu : పరాశరుడు -- వసిష్టుని మనుమడు. శక్తి పుత్రుడు. ఇతని తల్లి అదృశ్యంతి. పరాశరుడు ఒకనాడు తీర్థయాత్రకు పోవుచు యమునా నదిలో పడవ నడుపుచున్న మత్స్యగంధిని చూచి మోహించెను. ఆమె కన్యాత్వము పాడవకుండా అభయమిచ్చి, శరీరపు దుర్వాసన పోవునట్లు వరం ప్రసాదించి, యమునా నదీ ప్రాంతాన్ని చీకటిగా చేసి ఆమెతో సంగమించెను. వీరికి వ్యాసుడు జన్మించెను.

Parikṣit : పరీక్షిత్తు -- అంటే అంతటా దర్శించగలవాడని అర్దము . అభిమన్యుని కుమారుడు. ఇతని తల్లి ఉత్తర. తల్లి గర్భంలో ఉన్నప్పుడే అశ్వత్థామ ఇతనిపై బ్రహ్మ శిరోనామకాస్త్రము యోగించెను. దాని మూలంగా కలిగిన బాధనోర్వలేక ఉత్తర శ్రీకృష్ణుని ప్రార్ధించెను. ఆతని కరుణ వలన బాధ నివారణమై శిశువుగా ఉన్న పరీక్షిత్తు బ్రతికెను. ఇతడు ఉత్తరుని కూతురు ఇరావతి ని వివాహము చేసుకొనెను. ఇతని కుమారుడు జనమేజయుడు.

Puthana : పూతన --- ఒక రాక్షసి . బాలకృష్ణుని చే వధించబడుతుంది .

Pradyumnudu : ప్రద్యుమ్నుడు - ప్రకృష్టమైన (అధికమైన) బలము కలవాడు (ధ్యుమ్నము :బలము). ప్రద్యుమ్నుడు శ్రీ కృష్ణుడి కి రుక్మిణి కి జన్మించన సంతానం. ప్రద్యుమ్నుడి పాత్ర భాగవతం లొ వస్తుంది. శంభరాసురుడు అనే రాక్షుసుడిని సంహరిస్తాడు . మాయవతి (రతి దేవి) ఈయన భార్య .

PanchavaTi , పంచవటి : రాముడు వనవాస సమయం లో దండకారణ్యములోని ఆశ్రమము పేరు .




  • ========================================
Visit my Website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog material