Monday, August 9, 2010

Names with letter V


Vigneswarudu :  విఘ్నేశ్వరుడు - శివ పార్వతుల ఇద్దరి కుమారులలో పెద్దవాడు విఘ్నేశ్వరుడు , గణేషు , గనపతి అని అనేక పేర్లు ఉన్నాయి. ఇతనికి ఇద్దరు భార్యలు సిద్ధి , బుద్ధి .


vaalmiki : వాల్మీకి - నిరాహారుడై తపస్సు చేయగా వాని శరీరముపై వల్మీకములు (పుట్టలు) మొలచుటవలన వాల్మీకి అయ్యాడు. వాల్మీకి సంస్కృతంలో ఆదికవి. రామాయణాన్ని వ్రాశాడు. వాల్మీకి ముని పూర్వపు నామధేయం అగ్ని శర్మ, తండ్రి ముని ప్రచితాస(Prachetasa sage) .అతి చిన్నవయసులో అడవిలో తప్పిపోయి రత్నాకరుడు గా ఒక బోయవాని దగ్గర పెరిగి పెద్దవాడయ్యాడు పెంపుదు తల్లిదండ్రులు కౌశికి, సుమతి.

Vedi : వేది -- బ్రహ్మ దేవుని భార్య ;

VyaasuDu : వ్యాసుడు - వేదాల్ని వ్యాసం (విభజించి వ్యాప్తి చేయుట) చేసినవాడు. హైందవ
సాంప్రదాయంలో కృష్ణద్వైపాయుడు గా పిలువబడే వాడు వ్యాసుడు. వేదాలను విభజించడం వల్ల వేద వ్యాసుడయ్యాడు. వేదాలతో పాటు ఉపవేదాలు , 555 బ్రహ్మసూక్తులు , 108 ఉపనిషత్తులు , మహాభారతం, మహాభాగవత తో పాటు అష్టాదశపురాణాలు రచించాడు వ్యాసుడు. వ్యాసుడు సప్తచిరంజీవులలో ఒకడు. ఈయన తండ్రి ' పరాశరుడు ', తల్లి ' సత్యవతి ' . వశిష్టవంశము వాడు .

Vidhura : విదురుడు - బుద్ధిమంతుడు , తెలివిగలవాడు. విదురుడి జననం--కురువంశాన్ని నిలపడానికి సత్యవతి తన కోడళ్ళైన అంబిక ని, అంబాలిక ని దేవరన్యాయం ప్రకారం ధర్మ సమ్మతంగా సంతానం పొందించే ఏర్పాటు చేస్తుంది. అంబిక వ్యాసుడిని చూసి కళ్ళు మూసుకొనడం వల్ల గుడ్డివాడగు ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు. అంబాలికకు వ్యాసుడిని చూసి కంపించడం(pale) వల్ల పాండు రోగంతో పాండు రాజు జన్మిస్తాడు. మంచి వారసత్వాన్ని ఇవ్వమని కోరితే వ్యాసుడు మళ్లీ దేవరన్యాయం వల్ల అంబిక కి సంతానం కలిగించడానికి అంగీకరిస్తాడు. గడ్డాలు గల వ్యాసుడితో సంభోగించడానికి ఇష్టం లేని అంబిక తన దాసిని వ్యాసుడి వద్దకు పంపుతుంది.ఈ విధంగా పంపబడిన దాసి ఎంతో సంతోషముతో వ్యాసుడితో సంభోగిస్తుంది. దాసితో సంభోగించగా జన్మించిన వాడు విదురుడు.

Vibhishana : విభీషణుడు - దుష్టులకు విశేష భీతిని కలిగించువాడు అని అర్దము . రామాయణంలో ఒక ముఖ్య పాత్ర. రావణ, కుంభకర్ణు లు విభీషణుడి అన్నలు. ఇతని భార్య పేరు ' సరమ ' . రావణ సంహారము తర్వాత లంక కు రాజు అయ్యాడు .

Viswarupudu : విశ్వ రూపుడు -- విశ్వకర్మ కుమారుడు , సూర్యుని 

కుమార్తె ' విష్టి ' ఇతని భార్య .


విశ్వామిత్రుడు ,Viswamitra : హిందూపురాణ గాధలలో ఒక ఋషి. రాజర్షిగాను, మహర్షిగాను, బ్రహ్మర్షిగాను వివిధ రామాయణ, భారత, భాగవతాది గాధలలో విశ్వామిత్రుని ప్రస్తావన ఉన్నది. విశ్వామిత్రుని గురించిన గాధలలో ప్రధానమైనవి:

  •     గాయత్రీ మంత్ర సృష్టి కర్త
  •     శ్రీరామున కు గురువు.
  •     హరిశ్చంద్రుని పరీక్షించినవాడు.
  •     త్రిశంకు స్వర్గాన్ని నిర్మించినవాడు, సృష్టికి ప్రతిసృష్టి చేసిన మహా తపోశక్తి సంపన్నుడు
  •     శకుంతలకు తండ్రి. ఆ విధంగా భరతునకు తాత.





  • ==========================================
Visit my Website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog material