Showing posts with label Names with letter U. Show all posts
Showing posts with label Names with letter U. Show all posts

Monday, August 9, 2010

Names with letter U

Urvashi : ఊర్వశి - ఊరువు (తొడ) నుండి ఉద్భవించినది. ఇంద్రుని సభలోని అప్సరసలలో ఒకరు. పూర్వం విశ్వామిత్రుడు తపస్సు ను భంగం చేయడానికి రంభ ను దేవేంద్రుడు పంపుతాడు. రంభ విశ్వామిత్రుడు తపస్సు ను భంగం చేయడానికి ప్రయత్నిస్తుండగా, విశ్వామిత్రుడు రంభ గర్వమనచడానికి తన ఉర్వుల నుండి ఒక అందమైన స్త్రీ ని సృష్టించాడు. ఆమె ఊర్వశి. విశ్వామిత్రుడు ఊర్వుల నుండి జన్మించింది కనుక ఊర్వశి అయింది.

Uttara : ఉత్తర -- విరాటరాజు కుమార్తె. ఉత్తరుడు ఈమె సహోదరుడు. పాండవులు తమ అజ్ఞాతవాసం విరాటుని కొలువులో చేసారు. అర్జునుడు తను ఇంద్రలోకంలో అప్సరసల వద్ద నేర్చుకున్న నాట్యము ఉత్తరకు నేర్పించాడు. తరువాత అర్జునుడు ఉత్తరను తన కుమారుడు అభిమన్యునితో వివాహము చేసాడు. అభిమన్యుడు పిన్న వయసులోనే కురుక్షేత్ర సంగ్రామంలో మరణించాడు. అభిమన్యుడు మరణించే సమయమునకు ఉత్తర గర్భందాల్చి ఉన్నది. ఆమెకు పుట్టిన కుమారుడు పరీక్షిత్తు. యధిష్టురుని తరువాత హస్తినాపురానికి పరీక్షిత్తు రాజు అయ్యాడు.

UttaruDu : ఉత్తరుడు -- విరాట రాజ్యానికి రాజైన విరాటరాజు కు ఇతని భార్య సుధేష్ణ కు పుట్టిన కుమారుడు . ఉత్తర ఈయన సహోదరి .

Urmila : ఊర్మిళ -- రామాయణంలో దశరథుని కోడలు మరియు లక్ష్మణుని భార్య. సీతారాములతో లక్ష్మణుడు వనవాసాలకు పోయిన తరువాత, అతనికి శ్రీరామ సంరక్షణార్ధం నిద్రలేమి కలిగింది. అందువలన ఊర్మిళ ఆ పదునాలుగు సంవత్సరాలు నిదురపోయిందని అంటారు. ఆధునిక కాలంలో ఎక్కువసేపు నిద్రపోయే వారిని ఊర్మిళాదేవితో పోలుస్తారు.

Uma : ఉమ - పార్వతి ( Parvati) హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

Usha : ఉష -- వెయ్యి బాహువులు కల్గిన బాణాసురుడు బలి చక్రవర్తి కుమారుడు. బాణాసురుని కూతురే ఉష . శ్రీకృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడి కుమారుడు అనిరుద్ధుడు ఈమె భర్త. వీరి కుమారుడు వజ్రుడు. బాణాసురుని వంశపరంపర-> * బ్రహ్మ కుమారుడు పరిచుడు * పరిచుని కుమారుడు కాశ్యపుడు * కాశ్యపుని కుమారుడు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు * హిరణ్యకశ్యపుని కనిష్ఠ పుత్రుడు ప్రహ్లాదుడు * ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు * విరొచుని కుమారుడు బలి చక్రవర్తి * ఆ బలి కొడుకే ఈ బాణాసురుడు * ఆ బాణాసురుని భార్య కండల.

ushana : ఉశన -- భృగువు భార్య , శుకృడి తల్లి .
Uluchi : ఉలూచి -- నాగకన్య . వాసుకి కుమార్తె . అర్జునుడు ఈమె ద్వారా ' ఇలావంతుడు ' ని జన్మనిస్తాడు .



  • ==================================
Visit my Website - > Dr.Seshagirirao-MBBS