Monday, August 9, 2010

Names with letter J

Jatayuvu : జటాయువు -- రామాయణంలో అరణ్యకాండలో వచ్చే ఒక పాత్ర (గ్రద్ద). ఇతను శ్యేని, అనూరుల కొడుకు. సంపాతి ఈతని సోదరుడు. దశరథుడు ఇతడి స్నేహితుడు. రావణుడు సీతని ఎత్తుకుని వెళ్తున్నపుడు జటాయువు అతనితో పోరాడి ఓడిపోతాడు. చివరకు రాముడికి సీతాపహరణ వృత్తాంతం చెప్పి ప్రాణాలు విడుస్తాడు. రాముడే జటాయువుకి దహన సంస్కారాలు చేస్తాడు.

Jamadagni : జమదగ్ని -- భృగు వంశానికి చెందిన మహర్షి. పరశురాముడు కి తండ్రి. భృగు మహర్షి వీరి వంశానికి మూల పురుషుడు. రేణుక ఈయన భార్య .

Janamejayudu : జనమేజయుడు -- మహాభారతంలో పరీక్షిత్తు కుమారుడు. అర్జునునికి ముని మనుమడు. వ్యాస మహర్షి శిష్యుడైన వైశంపాయనుడు ఇతనికి మహాభారత కథను వినిపించెను. మహాభారతంలో చెప్పినట్లుగా జనమేజయుడికి ఆరు మంది అన్నదమ్మలు. వారు కక్ష సేనుడు, ఉగ్ర సేనుడు, చిత్ర సేనుడు, ఇంద్రసేనుడు, సుశేణుడు, నఖ్యశేనుడు. . తండ్రి పరీక్షిత్తు మరణించగానే జనమేజయుడు హస్తినాపుర సింహాసనాన్ని అధిష్టించాడు. తన తండ్రి మరణానికి తక్షకుడు కారణమని తెలుసుకొని సర్పములపై కోపము చెంది సర్పజాతిని సమూలంగా నాశనం చేయడానికి సర్పయాగము చేయడానికి సంకల్పించాడు. ఈ యాగం ప్రారంభం కానుండగా వ్యాస మహర్షి మిగతా ఋషులతో కలిసి వస్తాడు. కేవలం శాపాన్ని నెరవేర్చడానికి మాత్రమే తక్షకుడు పరీక్షత్తు ను చంపిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సర్పజాతినీ మొత్తం నాశనం చేయ సంకల్పించడం, పాండవుల వారసుడిగా నీకు తగదని జనమేజయుడికి హితవు పలికారు. దాంతో జనమేజయుడు ఆ యాగాన్ని ఆపు చేయించాడు.

Jaya Vijayulu : జయ విజయులు -- శ్రీ మహా విష్ణువు నివాస స్థలమైన వైకుంఠానికి ద్వార పాలకులు. వీరి గురించి భాగవత పురాణం లో ఉంది. ఒక సారి బ్రహ్మ యొక్క మానస పుత్రులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు విష్ణువు దర్శనార్ధమై వైకుంఠానికి వేంచేస్తారు. వాళ్ళు వయసులో పెద్దవారైనా చూసేందుకు పిల్లల్లాగా కనిపించడంతో ద్వారపాలకులుగా ఉన్న జయవిజయులు శ్రీహరి వేరే పనులందు నిమగ్నమై ఉన్నాడనే వంకతో వారిని అడ్డగిస్తారు. దాన్ని అగౌరవంగా భావించిన సనక సనందనాదులు ఆగ్రహించి భూలోకం లో మర్త్యులై సంచరించెదరని శాపం ఇస్తారు. తనకు ఆ శాపం వెనక్కు తీసుకునే శక్తి లేదనీ కాకపోతే రెండు ప్రత్యామ్నాయాలు మాత్రం సూచించగలనని చెబుతాడు. అప్పుడు మహా విష్ణువు వారిరువుర్నీ పలుమార్లు విష్ణుభక్తులుగా జనియించి తిరిగి వైకుంఠానికి వస్తారో లేక మూడు సార్లు మహావిష్ణువు ఆగర్భ శత్రువులుగా, ఆయనకు సమానంగా శక్తివంతులుగా జన్మించి ఆయన చేతిలోనే మరణం పొంది వైకుంఠానికి వస్తారో తేల్చుకోమంటాడు. అందుకు వారు ద్వితీయ మార్గాన్నే ఎంచుకుంటారు.

Jaraasandhudu : జరాసంధుడు -- పరమ శివ భక్తుడు మరియు రాక్షసుడు. జరాసంధుడు బృహధ్రద్రుడి కుమారుడు. మగధను పరిపాలించిన మహారాజు. మహాభారతంలో సభాపర్వం లో వచ్చే పాత్ర. బృహద్రధ మహారాజు మగధని పరిపాలిస్తుండేవాడు. ఆయనకు ఇద్దరు భార్యల వలన సంతానం లేదు. సంతానము కోసము రాజు కోరిక మేరకు ఋషి చందకౌశిక మహర్షి ఆయనకు ఒక ఫలాన్ని ఇచ్చి, దాన్ని మహారాజు భార్య సేవిస్తే సంతానం కలుగుతుందని చెబుతాడు. (ఆ ఋషికి బృధ్రదుడికి ఇద్దరు భార్యలు ఉన్నారనే విషయం తెలియదు). రాజధాని చేరి అంతఃపురంలో ఉన్న ఇద్దరు భార్యలకు ఆ ఫలాన్ని సగ భాగం చేసి ఇద్దరికి పెడతాడు. ఆ సగ భాగాన్ని స్వీకరించిన ఇద్దరి భార్యలకు శిశువులు సగ భాగాలు జన్మిస్తారు. దీనితో దిబ్భాంత్రి లొనైన మహారాజు ఆ శిశు భాగాలను రాజధాని ఆవల విసిరి వేయమని తన సేవకులకు అప్పగిస్తాడు. సేవకులు రాజు చెప్పినట్లు రాజధాని ఆవల విసిరి వేస్తారు. అలా విసిరిన శిశువులు జరా అనే రాక్షసికి దొరుకుతారు. జరా అనే రాక్షసి ఆ శిశువులను దగ్గరకు తెచ్చి కలుపుతుండి. ఆ శిశువుకి ప్రాణం వచ్చి అరుస్తుంది. ఆ రాక్షసి శిశువుకి ప్రాణం రావడంతో తిరిగి మహారాజుకి తీసుకొని వెళ్ళి జరిగిన వృంత్తాంతాన్ని చెబుతుంది.

Jaambavanthudu : జాంబవంతుడు -- బ్రహ్మ ఆవులించగా పుట్టిన భల్లూకరాజు. కృత యుగం నుండి ద్వాపర యుగం వరకు జాంబవంతుని ప్రస్తావన ఉంది. క్షీరసాగర మధనం సమయంలోను, వామనావతారం సమయంలోను జాంబవంతుడు ఉన్నాడు. రామాయణంలో రాముని పక్షాన పోరాడాడు. కృష్ణునికి శమంతకమణిని, జాంబవతిని ఇచ్చాడు.




  • ============================================
Visit my Website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog material